నన్ను చూస్తూ ఉండడమే నా భార్యకు ఇష్టం : ఎస్ఎన్  సుబ్రమణియన్

  • ఎల్ అండ్ టీ చైర్మన్  వ్యాఖ్యలకు అదర్ పూనావాలా కౌంటర్

న్యూఢిల్లీ: వారానికి 90 గంటల పాటు పనిచేయాలన్న ఎల్ అండ్ టీ చైర్మన్  ఎస్ఎన్  సుబ్రమణియన్  వ్యాఖ్యలపై సోషల్  మీడియాలో కౌంటర్లు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ పారిశ్రామికవేత్తలు భిన్నంగా స్పందిస్తున్నారు. తాజాగా సీరం ఇన్ స్టిట్యూట్  ఆఫ్  ఇండియా సీఈఓ అదర్  పూనావాలా వెరైటీగా కౌంటర్  ఇచ్చారు. ఆదివారాలు తనను చూస్తూ ఉండడమే తన భార్య నటాషా పూనావాలకు ఇష్టమని ఆయన తెలిపారు. ‘‘నేనంటే నటాషాకు అమితమైన ప్రేమ, ఇష్టం. ఆదివారాలు నన్ను విడిచి ఉండడానికి అస్సలు ఇష్టపడదు.

ఎందుకంటే, ఆరోజు నన్ను చూస్తూ ఉండడానికే ఆమె ఇష్టపడుతుంది” అని ‘ఎక్స్’ లో అదర్  కౌంటర్  ఇచ్చారు. అంతకుముందు మహింద్రా గ్రూప్  చైర్మన్  ఆనంద్  మహింద్రా కూడా సుబ్రమణియన్  వ్యాఖ్యలపై ఓ టీవీ కార్యక్రమంలో స్పందించారు. ‘‘నా భార్య అందంగా ఉంటుంది. ఆదివారాలు ఆమెను చూస్తూ గడపడమే నాకు ఇష్టం. అలాగే, మనం ఎంతసేపు పనిచేశామన్నది ముఖ్యం కాదు. ఎంత నాణ్యతగా పనిచేశామన్నదే ముఖ్యం” అని సుబ్రమణియన్  వ్యాఖ్యలకు ఆయన కౌంటర్  ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఇద్దరి పారిశ్రామికవేత్తల వ్యాఖ్యలు సోషల్  మీడియాలో వైరల్ గా మారాయి.